
సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన రెండో రోజు అంగన్వాడీల మహాధర్నా
సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన రెండో రోజు అంగన్వాడీల మహాధర్నాలో నేతల డిమాండ్
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఐసిడిఎస్ కు నిధులు పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ( సిఐటియు ) ఆధ్వర్యంలో మంగళవారం మానుకోట తహసీల్ కార్యాలయం ముందు 48 గంటల మహాధర్నా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షలు బెస్త సంపూర్ణ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ… బుధవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఐసిడిఎస్ రంగానికి నిధుల కేటాయింపు పెంచాలని కోరారు. అంగన్వాడీలకు కనీస వేతనం 18 వేల రూపాయలకు పెంచాలని వారి పెండింగ్ టి ఏ లో డిఏలు ఇతరమైన వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు మంత్రులకు అనేక వినతిపత్రాలు ఇచ్చిన కానీ ప్రభుత్వం స్పందించట్లేదు అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, ఎన్నికల ముందు ప్రభుత్వ ఇచ్చిన హామీలు అమలు చేయాలి, అంగన్వాడి ఉద్యోగులు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి కనీస వేతనలు అమలు చేయాలని కోరారు. ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేసే పిఎం శ్రీ, నూతన జాతీయ విద్యా విధానంను అంగన్వాడి కేంద్రాల్లో అమలు చేసే విధానాన్ని విరమించుకోవాలి. అన్ని సౌకర్యాలు కల్పించి అంగన్వాడీ కేంద్రాలనే నర్సరీ కేంద్రాలుగా మార్చాలని, అంగన్వాడి ఉద్యోగులు అనేక సంవత్సరాల నుండి కోరుతున్నారు ఆయన ఈ ప్రభుత్వం ఈ అంశాలను పట్టించుకోకుండా పోటీ కేంద్రాల పేరుతో ఐసిడిఎస్ నిర్వీర్యం చేయడం తగదని వారన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం టీచర్‌కు రెండు లక్షలు హెల్పర్ కు లక్ష రూపాయలు చెల్లించే విధంగా జీవోను సవరించి వెంటనే విడుదల చేయాలని కోరారు. రిటర్న్మెంట్ అయిన అంగన్వాడి ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్స్ ఇవ్వాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆరోగ్యలక్ష్మి, మెనూ చార్జీలు పెంచాలి. మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా మారుస్తూ జీవో జారీ చేసినప్పటికీ పది నెలల నుండి వీరికి వేతనాలు చెల్లించలేదని తక్షణం వారి పెండింగ్ వేతనాలను ఇవ్వాలని కోరారు. అంగన్వాడీల ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కారం చేయనిచో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారి హల్యానాయక్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి దారా స్నేహ బిందు, సిఐటియు నాయకులు కుమ్మరి కుంట్ల నాగన్న, సమ్మెట రాజమౌళి, తాడబోయిన శ్రీశైలం, దుండి వీరన్న అంగన్వాడీ యూనియన్ నాయకురాలు పగిడి పాల తిరుపతమ్మ, స్వరూప, నీలా, లలిత, ధనలక్ష్మి, మంగ, శైలజ, ఉమా, వీరలక్ష్మి ,జ్యోతి, పద్మ, సమ్మక్క, భద్రకాళి, సంద్య, సలీమా, మల్లికాంబ, సరిత, రజిని, కవిత తదితరులు పాల్గొన్నారు.