
** రాజమండ్రి డిసెంబర్ 10తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ దావతే ఇలల్లాహ్ శాఖ ఆధ్వర్యంలో ప్రచార సభ నిర్వహించారు. అహ్మదీయ జమాత్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు షేక్ నబీ సాహెబ్ అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా జాతీయ ఉప కార్యదర్శి మౌల్వీ సయ్యద్ ఫహీం అహ్మద్ (ఖాదియాన్,పంజాబ్)మరియు తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మౌల్వీ ముహమ్మద్ షబ్బీర్ అహ్మద్ యాకూబ్,మరియు బదర్ వార పత్రిక ఇన్స్పెక్టర్ మౌల్వీ జావేద్ అహ్మద్,ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు ముహమ్మద్ సలీం పాల్గొని ప్రసంగించారు.ప్రపంచ సంస్కరణ చేయుటకు, అన్ని మతాలను,ధర్మాలను ఒకే సమాజముగా చేయుటకు అవతార పురుషునిగా హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ అలైహిస్సలాం పంజాబ్ రాష్ట్రం ఖాదియాన్ గ్రామంలో అవతరించారని అన్నారు. జమాత్ 5వ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ అయ్యదహుల్లాహు తాలా బినస్రిహిల్ అజీజ్(లండన్ ఇంగ్లాండ్)ఆధ్వర్యంలో ప్రేమ అందరితో ద్వేషం ఎవ్వరితో లేదు అనే నినాదంతో నేడు ప్రపంచ నలుమూలలో అహ్మదీయ ప్రతినిధులు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారని అన్నారు.215 దేశాలకు పైగా దేశాలలో అహ్మదియత్ వృక్షం నాటడం జరిగిందని అన్నారు.అన్య మత,ధర్మాల ప్రజలు అహ్మదీయ జమాత్ ను స్వీకరించడం అనివార్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అన్నపూర్ణమ్మ,ఉప సర్పంచ్ ఫణి,ఎంపిటీసి, సంగం పోషయ్య,మాజీ జడ్పీటీసీ కొంచ భాస్కర్ రావు,పాస్టర్ ఏబు,మరియు ఈస్ట్ గోదావరి అహ్మదీయ ఉపాధ్యక్షులు జిల్లా యూత్ అధ్యక్షులు సుల్తాన్,స్ధానిక అహ్మదీయ సదర్ షేక్ ఖాసిం ఫారూఖ్,షేక్ లాల్ సాహెబ్,అలియొద్దీన్,నాగూర్ సాహెబ్,మస్తాన్,మస్తాన్ వలీ,మదీనా బాషా, దాదా సాహెబ్,మస్తాన్ గాంధీ,ఇస్మయీల్ సాహెబ్ స్ధానిక మౌల్వీ ముహమ్మద్ అక్బర్,తదితరులు పాల్గొన్నారు.