
ఈ69న్యూస్ వరంగల్
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం రంగశాయి పేట ఆర్టీఏ సర్కిల్ లెనిన్ నగర్ లో ఆక్రమణకు గురైన పుల్లాయి కుంట తూమును గురువారం మున్సిపల్ అధికారులు సందర్శించి పరిశీలించారు.తూమును ఆక్రమించుకున్న వ్యక్తితో నేరుగా ఫోనులో మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలు,పత్రాలు జమ చేయాలని ఆదేశించారు.అనంతరం లెనిన్ నగర్ కాలని వ్యవస్థాపకులు మాలోతు సాగర్ మీడియాతో మాట్లాడారు.పుల్లాయి కుంట చెరువు విస్తీర్ణం 30 ఎకరాల్లో ఉండేదని ఆక్రమణకు గురై ఇప్పుడు రెండు 3ఎకాలు మాత్రమే మిగిలిందని వాపోయారు.ఈ విషయం గత ప్రభుత్వం హయాంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని గత సోమవారం ప్రజా వాణిలో
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
కు వినతి పత్రం అందజేయడం జరిగిందని దాంతో గురువారం మున్సిపల్ అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన కుంటను పరిశీలించారన్నారు.పుల్లాయికుంట తూము ఆక్రమణ ను తొలగించి వరద ముంపు నుండి 250 కుటుంబాలను కాపాడాలని కోరారు.