
ఈ69న్యూస్ హనుమకొండ
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టులోని ఎం టీ ఆర్ గార్డెన్లో ఆగస్టు 7న వికలాంగుల,చేయూత,పెన్షన్ దారుల జిల్లా మహాసభ ఘనంగా నిర్వహించనున్నారు.ఈ మహాసభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ విషయాన్ని మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎమ్మెస్పీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వై.కే.విశ్వనాథ్ మాదిగ,హనుమకొండ జిల్లా ఇంచార్జి కందుకూరి సోమన్న మాదిగ తెలిపారు.సోమవారం ధర్మసాగర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులు,వృద్ధులు,వితంతువులు,ఒంటరి మహిళలు,చేనేత,బీడీ,గీత కార్మికులకు పెన్షన్లు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు.అయితే అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా పెన్షన్లను పెంచకపోగా,నాలుగు నెలల పెన్షన్లు ఇవ్వలేదని విమర్శించారు.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ దారులు ఆందోళనకు సిద్ధమవుతున్నారని తెలిపారు.ఈ జిల్లా మహాసభ లక్ష్యంగా ఈనెల 13న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.పెన్షన్ హక్కుల కోసం సాగిస్తున్న ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో భాగంగానే ఈ జిల్లా స్థాయి సమావేశం జరుగుతుందన్నారు.ఈ సభలో జిల్లాలోని 14 మండలాల ప్రతీ గ్రామం నుండి వందలాది వికలాంగులు,వృద్ధులు,వితంతువులు,చేనేత,బీడీ కార్మికులు పాల్గొనాలని కోరుతూ ప్రజలను సమర్థవంతంగా భాగస్వామ్యం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సోంపల్లి అన్వేష్ మాదిగ,పుట్ట ప్రశాంత్ మాదిగ,సింగారపు పవన్ మాదిగ,చిలుక రాజు మాదిగ,కొట్టే శంకర్ మాదిగ,బొడ్డు ప్రణయ్ మాదిగ,నక్క పవన్ మాదిగ,బుచ్చిరాములు, చిలుక మధుకర్ తదితరులు పాల్గొన్నారు.