
ఆటో యూనియన్ తరుపున క్వింటా బియ్యం అందజేత
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రంగు నర్సయ్య గౌడ్(8౦) కొన్ని రోజుల క్రితం మృతిచెందాడు.మృతుని చిన్న కుమారుడు రజినీ కాంత్ యొక్క ఆటో యూనిన్ మిత్రులు దశదిన కర్మ కార్యక్రమానికి తమ వంతు సహాయంగా క్వింటా బియ్యం అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.మేమున్నామని ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో గౌడ కుల సంఘ అధ్యక్షులు గుండెబోయిన సతీష్,ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.