
ఈ69న్యూస్ వరంగల్
వరంగల్ ఎల్లం బజారుకు చెందిన ఓ వ్యక్తి వ్యక్తిగత సమస్యలతో రెండంతస్తుల భవనం పైకి చేరుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మట్టేవాడ పోలీసులు ఆ వ్యక్తిని కాపాడారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ పట్టణంలోని ఎల్లం బజార్ కు చెందిన కట్టుకోజు శివకుమార్ అనే వ్యాపారి ఎల్లం బజార్ లోని ఆదర్శ వీధి గల మహబూబ పంచధన్ కాలేజీ ఎదురుగా ఉన్న రెండంతస్తుల బిల్డింగ్ పైకి వ్యక్తిగత సమస్యలపై ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు వెంటనే డైల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న మట్టవాడ బ్లూ కోర్టు సిబ్బంది ఆ వ్యక్తిని బిల్డింగ్ పై నుంచి కిందికి దించి రక్షించి సురక్షితంగా తన కుటుంబ సభ్యులకు అప్పగించార.పోలీసులు దీంతో నగర ప్రజలు మట్టవాడ సిబ్బంది మరియు ఫైర్ సిబ్బందిపై హర్షం వ్యక్తం చేశారు.
