
ఈ69 హనుమకొండ జిల్లాలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ,ఉద్యాన,పట్టు పరిశ్రమ శాఖల సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన ప్రగతి వివరాలను అధికారులు కలెక్టర్కు నివేదించారు.కలెక్టర్ మాట్లాడుతూ..తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చే ఆయిల్ పామ్ సాగును రైతులకు వివరించాలని,పైలెట్ ప్రాజెక్ట్ ముగిసేలోపు రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లాలో సెరికల్చర్ అభివృద్ధిపై కూడా చర్చ జరిగింది.అనంతరం ఉద్యాన శాఖ ప్రచార పుస్తికను కలెక్టర్ ఆవిష్కరించారు.సమావేశంలో వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్,ఉద్యాన శాఖ అధికారి అనసూయ,సెరికల్చర్ అధికారులు సంజీవరావు,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.