
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తెలంగాణ లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ప్రజలను కోరారు.శుక్రవారం
మండల కేంద్రంలోని వల్లాపురం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారెంటీల ప్రచారం ప్రారంభించారు.గ్రామం నుంచి కోదాడ మాజీ శాసన సభ్యురాలు ఉత్తం పద్మావతి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లపై ప్రచారం నిర్వహించారు.రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. అధికారం చేపట్టిన రోజే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ ప్రచారం వల్లపురం తో పాటు సిరిపురం నారాయణపురం, బృందావనపురం, వేణుగోపాలపురం, కేశవాపురం, కరివిరాల, కాగిత రామచంద్రపురం గ్రామాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ సభ్యులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, కోదాడ పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, మండల పార్టీ అధ్యక్షుడుబూతుకూరి వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శీను,ప్రధాన కార్యదర్శి వేపూరి తిరుపతమ్మ సుధీర్, నాయకులు సురేందర్ రెడ్డి, కిన్నెర నాగయ్య, కళింగ రెడ్డి, సర్పంచ్ లు మొక్క లక్ష్మీ వేణ బిక్షపతి, గుర్రం నీలిమా గాంధీ, ఎంపీటీసీ శెట్టి జ్యోతి సతీష్, వీరారెడ్డి, గోవర్ధన్, వేల్పుల సోమయ్య, ఉపేందర్, నాగరాజు ,కోటేష్, మాతంగి బసవయ్య కార్యకర్తలు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.