ఆర్టీఐ కమిషనర్ ని కలిసిన సేవాదళ్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కుల కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి ను హనుమకొండ హరిత హోటల్లో వరంగల్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు నకరకంటి మోహన్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోలేపల్లి శంకర్ రెడ్డి,సయ్యద్ పాషా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు కమిషనర్‌ను ఆత్మీయంగా పలకరించి,రాష్ట్రంలో పారదర్శకత,బాధ్యతాయుత ప్రభుత్వ నిర్వాహణలో ఆర్టీఐ కమిషన్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రశంసించారు.ప్రజల సమస్యలు,స్థానికంగా వస్తున్న ఫిర్యాదులు,సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన పెంపుకు అవసరమైన చర్యలపై కూడా నాయకులు కమిషనర్‌తో చర్చించినట్లు తెలిసింది.సమావేశంలో ప్రజలకు సమయానికి సమాచారం అందేలా చర్యలు మరింత బలోపేతం చేయాలని,జిల్లా స్థాయిలో ఆర్టీఐ హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనే అవసరంపై అభిప్రాయాలు పంచుకున్నారు.కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి నాయకుల సూచనలు,అభిప్రాయాలను శ్రద్ధగా విని,ప్రజా పరిపాలనలో పారదర్శకతను పెంచేందుకు కమిషన్ కట్టుబడి ఉందని తెలిపారు.