
ఎస్ డబ్ల్యు ఎఫ్ ప్రధాన కార్యదర్శి విఎస్ రావు.
—-ఎస్ డబ్ల్యు ఎఫ్ ప్రధాన కార్యదర్శి విఎస్ రావు.~
ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఐక్య పోరాటాలు నిర్మిద్దామని,గత అనుభవాలతో జేఏసీల నిర్మాణంలో భాగస్వామ్యం అవుదామని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి వి.ఎస్ రావు పిలుపునిచ్చారు.
శనివారం మధ్యాహ్నం ఖమ్మంలోని నేపాల్ దేవ్ భట్టాచార్య నగర్,యర్రా శ్రీకాంత్ ప్రాంగణం (ఐఎంఎ హాల్)లో వీరాంజనేయులు,అల్లంశెట్టి వెంకటేశ్వర్లు,ప్రభాకర్, అధ్యక్షవర్గంగా ఏర్పాటైన ప్రతినిధుల సభలో విఎస్ రావు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు.అన్ని రీజియన్ ల నుండి ప్రతినిధులు నివేదిక పై చర్చల్లో పాల్గొన్నారు.ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో వస్తున్న సమస్యలపై రాష్ట్ర కార్యదర్శి రవీందర్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా,ఖమ్మం రీజియన్ నుండి బాణాల రాంబాబు బలపరుస్తూ మాట్లాడారు.ఆర్టీసీలో మహిళా సమస్యలు పరిష్కరించాలని డిపోలలో పని ప్రదేశాల్లో వారికి కనీస వసతులు కల్పించాలని సరిత తీర్మానాన్ని ప్రవేశపెట్టగా,ఉపేంద్రాచారి తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడారు.రెండు తీర్మానాలను మహాసభలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రతినిధుల సభలో ముందుగా రాష్ట్ర కార్యదర్శి జల్లా పద్మావతి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ప్రతినిధులు మనం పాటించి అమరులకు నివాళులర్పించారు.
ప్రతినిధుల సభ చర్చలలో ఖమ్మం రీజియన్ నుండి రాంబాబు నల్గొండ నుండి నరసింహ వరంగల్ నుండి ఉపేంద్రాచారి కరీంనగర్ నుండి రాపల్లి రాజయ్య మహబూబ్ నగర్ నుండి గోపాల్ పాల్గొన్నారు.