
– ఆర్డిటిని కలిసికట్టుగా కాపాడుకుంటాం ….
– ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
తెలుగుగళం న్యూస్, శింగనమల,సెప్టెంబర్-23.
ఆర్డీడీకి సంబంధించిన ఎఫ్.సి.ఆర్.ఏ. రెన్యువల్ విషయమై అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ విద్య,ఐటి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ కు వినతి చేశారు. నేతలందరూ ఆర్.డి.టి. సంస్థ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఆర్డిటిని కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కేంద్రంతో నిరంతర సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఆర్డిటి గురించి ప్రత్యేక దృష్టి సారించినట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్యులు నారా లోకేష్ లు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఉమ్మడి అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా విద్య, వైద్యాన్ని పేదలకు అందిస్తున్న ఆర్డిటిని జిల్లా ప్రజా ప్రతినిధులమంతా ఐక్యమత్యంతో కాపాడుకుంటామని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు తెలిపారు.వైసీపీ నేతలు రాజకీయ ఉనికి కోసం చేసే మోసపు చర్యల్ని ప్రజలందరూ గమనిస్తున్నట్లు తెలిపారు.వైసీపీ పార్టీ అబద్ధాలకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు.ఈ భేటీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి,పెనుగొండ ఎమ్మెల్యే సవితమ్మ ,రాయదుర్గం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు,రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత,అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్,మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్. రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు.