
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఆర్డిఓ కార్యాలయంలో
అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఆర్డిఓ మాట్లాడుతూ..నిరంతర ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ లిస్ట్ లలో ఎలాంటి తప్పులు లేకుండా 100% అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేయాలని అలాగే ఈ నమోదులో అందరి భాగస్వామ్యం ఉండాలని దానికి గాను ప్రతి పోలింగ్ స్టేషన్ నందు ప్రతి రాజకీయ పార్టీ ఒక బూత్ లెవెల్ ఏజెంట్ నియామకం చేసుకొని ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ప్రతి పోలింగ్ స్టేషన్ లోని బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకొని ఓటర్ల జాబితాను ఎలాంటి తప్పు లేకుండా చూసుకోవాలని చెప్పారు.ఈ సమావేశంలో స్టేషన్గన్పూర్ మరియు జఫర్గడ్ తాసిల్దార్ లు వెంకటేశ్వర్లు,శంకరయ్య నాయబ్ తహసిల్దార్ సదానందం మరియు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.