
ఆర్డీవో కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో స్వాతంత్ర సమరయోధుడు,తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు.రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్.వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆర్డీవో వెంకన్న మాట్లాడుతూ..నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర ఉద్యమంలో బాపూజీ అహర్నిశలు పోరాడారు.తొలి దశ,మలి దశ తెలంగాణ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచి,రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు అని అన్నారు.కార్యక్రమంలో డివిజనల్ పరిపాలన అధికారి డి.శంకరయ్య,నాయబ్ తహసీల్దారు సునంద,ఆర్డీవో సీసీడీ ఉపేందర్,సీనియర్ సహాయకులు శ్రీనివాస్,జూనియర్ సహాయకులు వినయ్,సృజన్ కుమార్,బంగారి,శ్రీనివాస్,సునీల్,సంతోష్,టైపిస్టు ఎల్లయ్య,రికార్డు అసిస్టెంట్ వి.వెంకటేశ్వర్లు,సువార్త,సబార్డినేటర్లు సారయ్య,అశోక్,అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.