ఆర్డీవో కార్యాలయంలో మాదక ద్రవ్యాల నీరోధక ప్రతిజ్ఞ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు స్టేషన్ ఘనపూర్ లోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో బుధవారం“మాదక ద్రవ్యాల నీరోదక ప్రతిజ్ఞ”కార్యక్రమం నిర్వహించారు.రెవెన్యూ డివిజనల్ అధికారి డి.యస్.వెంకన్న కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేయిస్తూ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలను సమాజానికి తెలియజేయడం,వాటి నిర్మూలనకు అందరం బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ పరిపాలన అధికారి డి.శంకరయ్య,నాయబ్ తహసీల్దారు వేణు కుమార్,సీనియర్ సహాయకులు డి.ఉపేందర్,శ్రీనివాస్,జూనియర్ సహాయకులు వినయ్,స్రుజన్ కుమార్,బంగారి,శ్రీనివాస్,సునీల్,సంతోష్,టైపిస్టు ఎల్లయ్య,రికార్డు అసిస్టెంట్ వి.వెంకటేశ్వర్లు,సువార్త పాల్గొన్నారు.అదేవిధంగా కార్యాలయ సబార్డినేటర్లు సారయ్య,అశోక్,సురెందర్,అభిరామ్ తదితరులు పాల్గొని మత్తు పదార్థాల వినియోగాన్ని నిరోధించేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపారు.