
ఈ69న్యూస్ యాచారం,ఆగస్టు 19
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యాచారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు.అనంతరం ఆసుపత్రి అధికారులకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య,మండల కన్వీనర్ ఎస్.చందు నాయక్ మాట్లాడుతూ..ఆశా వర్కర్లకు జూలై నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని,ఆగస్టు నెల పారితోషికాలు ఆలస్యం చేయకుండా సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఫిక్సిడ్ వేతనం రూ.18,000/-గా అమలు చేయాలని,గతంలో సమ్మెలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.“ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని,ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి.ఇన్సూరెన్స్ రూ.50 లక్షలు,మట్టి ఖర్చులు రూ.50 వేలు,రిటైర్మెంట్ బెనిఫిట్స్,సెలవులు,ప్రమోషన్స్ కల్పిస్తామని రాష్ట్ర ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.ఈ వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలి.లేకపోతే మరింత ఉధృతమైన ఆందోళనలకు సిద్ధం అవుతాము”అని నేతలు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యాచారం మండల ఆశా యూనియన్ నాయకురాలు శోభ రాణి,సుశీల,నరసమ్మ,లలిత,స్వాతి,పద్మ,ఎల్లమ్మ,బాలామణి,సైదమ్మ, నాగమణి,లక్ష్మి,గరిష,రమాదేవి,గోవిందమ్మ,వైదేవి,అలవేలు,మంజుల,అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.