
తల్లాడ: మండల కేంద్రంలో ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె శిబిరం వద్దకు వచ్చి తెలంగాణ రైతు సంఘం తల్లాడ మండల కమిటీ తమ మద్దతు తెలియజేశారు సందర్భంగా జిల్లా రైతు సంఘం నాయకులు సేలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 13 నెలల పాటు రైతులు ధర్నా చేసిన ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి క్షమాపణ చెప్పి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిందని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచాలని దేశంలో ఎక్కడా లేనివిధంగా తమ వేతనాలు పెంచుకున్న శాసనసభ్యులు మన ముఖ్యమంత్రి ఆశాలకు వేతనాలు పెంచుటలేదని వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అమలు చేసే వరకు మీ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మీరు చేస్తున్న పోరాటానికి రైతు సంఘం మద్దతు ఉంటుందని తెలియజేశారు కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అయినాల రామలింగేశ్వరరావు సిఐటియు మండల కార్యదర్శి షేక్ మస్తాన్ చల్లా నాగేశ్వరరావు మేడి బిక్షం తదితరులు పాల్గొన్నారు