
హన్మకొండ, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధనకు ఫిబ్రవరి 9 న హైదరాబాద్ లో జరిగే ప్రజాసంఘాల మహాధర్నా ను జయప్రదం చేయాలని సీపీఎం బోట్ల చక్రపాణి జిల్లా కన్వీనర్ హన్మకొండ సౌత్ మండల సమావేశం పాల్గొని పిలుపునిచ్చారు. సోమవారం సీపీఎం జిల్లా పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్ల స్థలాల కోసం అనేక జిల్లాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూ. ఇవ్వాలని, స్థలం లేనివారికి 120 గజాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రమ్ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశం లో హనుమకొండ సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ మరియు మండల కమిటీ సభ్యులు ఆలకుంట యాకయ్య దూడపాక రాజేందర్ ,ఆలకుంట మల్లయ్య, నోముల కిషోర్ , ఎన్నం వెంకటేశ్వర్లు కంచర్ల కుమారస్వామి, పాల్గొన్నారు