
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
మరిపెడ గళం న్యూస్.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ తీసి ఏర్పాటు చేసిన రోడ్డు షో లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అధ్వర్యం లో ఏర్పాటు చేసిన రోడ్డు షో లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థిగా పోరీక బలరాం నాయక్ ను కాంగ్రెస్ పార్టీ తరపున లక్ష మెజారిటీ తో ఈ పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు మరియు మ్యానిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు,బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తొలగించే కుట్రలు చేస్తున్నారని చెప్పారు,కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షించి ఉన్న రిజర్వేషన్లను పెంచుతుందని దేశ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించారు,బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి సచ్చిన పీనుగలా మారిందన,
పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పూర్తిగా భూస్థాపితం అవుతుందని అన్నారు,కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల పక్షాన నిలిచి,అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని,
పేదల సంక్షేమం, అభివృద్దే కాంగ్రెస్ పార్టీ అజెండా అని పేర్కొన్నారు, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను దాదాపుగా అమలు చేసిందని
ఆగష్టు 15 తారీఖు లోపు రైతులకు రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు,తెలంగాణ సెంటిమెంట్ తో బీఆర్ఎస్ పార్టీ,దేవుడు మతం పేరుతో బీజేపీ పార్టీ ఓట్లు అడుక్కుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు..
కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసిన అభివృద్ది గురించి చెప్పి ఓట్లు అడుగుతుందని అన్నారు,ప్రజలు చైతన్యవంతులు అయ్యారు అని సెంటిమెంట్ రాజకీయాలకు కాలం చెల్లింది,
ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తమకు ఉపాధి కల్పించి అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు,దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కి విపరీతమైన ప్రజాదారణ పెరుగుతున్నదని,కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు, అందుకే ఇక్కడ మనమంతా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బలరాం నాయక్ కి ఓట్లు వేసి ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొస్తాడని తద్వారా మన ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. బైక్ ర్యాలి,పట్టణమంతా కాంగ్రెస్ మయం,వేలాదిగా తరలి వచ్చిన యువకులతో భారీ బైక్ ర్యాలీ పార్టీ శ్రేణుల్లోకార్యకర్తల్లో,నాయకుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది,ఈ కార్యక్రమంలో మరిపెడ మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి,కురవి మండల పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం, డోర్నకల్ మండల పార్టీ అధ్యక్షుడు జగదీష్, నర్సింహుల పేట మండల పార్టీ అధ్యక్షుడు బట్టు నాయక్, కొమ్మినేని రవీందర్,కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, సంపేట రాము గౌడ్,జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్,పెండ్లి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా మైనార్టీ నాయకులు అఫ్సర్,పట్టణ మైనార్టీ అధ్యక్షులు అజీజ్ పాషా,కుడితి వెంకట్ రెడ్డి,,విసారపు శ్రీపాల్ రెడ్డి, దేవరశెట్టి లక్ష్మీనారాయణ, కారంపూడి ఉపేందర్, అలువాల ఉపేందర్, దేవరశెట్టి కృష్ణమూర్తి ,దేవరశెట్టి వెంకన్న, నిర్మల్ రాజు,బోర గంగయ్య,జాటోత్ సురేష్ పాల్గొన్నారు.