
భారతరత్న, రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ బీ ఆర్ అంబేద్కర్ గారి 66 వర్ధంతి కార్యక్రమాన్ని పూలే అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో మల్లారం గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తల్లాడ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ గారు మరియు నీటిపారుదల శాఖ ఏఈ మేడి అప్పారావు గారు హాజరయ్యి అంబేద్కర్ గారి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అంబేద్కర్ గారి యొక్క త్యాగాలను వారి యొక్క ఔన్నత్యాన్ని కొనియాడారు. ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అంబేద్కర్ గారిని స్పూర్తిగా తీసుకోవాలని తెలియజేశారు. మరియు ప్రస్తుతానికి ఉద్యోగాలకు సిద్దమవుతున్న విద్యార్థులకు సూచనలు సలహాలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మరియు ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ మేడి సీతారాములు , వైస్ ప్రెసిడెంట్ అద్దంకి వెంకటేశ్వర్లు , యువజన సంఘం బాధ్యులు మేడి వేణు, అద్దంకి ముత్తు, అద్దంకి కృష్ణ, గాజుల శశి,రవి వర్షన్, కుంభగిరి నాగేశ్వరరావు, అద్దంకి అర్జున్, మేడి బిక్షం, పాస్టర్ మేడి ఇశ్రాయేలు తదితరులు పాల్గొన్నారు.E69 న్యూస్ రిపోర్టర్ యాకోబు