
telugu galam news e69news local news daily news today news
బంజారా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవాలాల్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సౌజన్య డిసిపి సాయి చైతన్య గారికి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా రవీందర్ నాయక్ నగర్ కాలనీ బంజారా వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు కృష్ణ నాయక్ మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని గొల్లలదొడ్డి దగ్గరున్న సేవాగఢ్లో బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మించారని తెలుస్తోంది. సంత్ సేవాలాల్1739 ఫిబ్రవరి 15న పుట్టారు. ఆయన గొప్ప సంఘ సంస్కరణవాది. ఆధ్యాత్మిక గురువు. సంత్ సేవాలాల్ జగదంబకు భక్తుడు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఓ బ్రహ్మచారి. ఆయన విశిష్ట బోధనలతో యశస్సును పొందారు. సంత్ లాల్ బంజారాల హక్కులు, నిజామ్, మైసూరు పాలకుల దాష్టీకాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. ముఖ్యంగా 18వ శతాబ్దంలో సాగిన పోరాటంలో సంత్ సేవాలాల్ ముఖ్యపాత్ర పోషించారు. అంతేకాకుండా బ్రిటిషులు, పాలకుల ప్రభావాలకు గురికాకుండా, బంజారాలు ఇతర ఆచారాలను, సంప్రదాయాల్లోకి మారకుండా సంత్ సేవాలాల్ ఎంతగానో కృషిచేశారు. బంజారాల ఆచారాలు, కట్టుబాట్లు, విభిన్నమైన దుస్తులతో తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారంటే అది సంత్ సేవాలాల్ చేసిన కృషే. అందుకే, బంజారాలు ఆయన్ను దైవంతో భావించి ప్రతిఏటా ఆయన జయంతిని ఎంతో వైభవంగా నిర్వహింస్తున్నారు. రవీందర్ నాయక్ నగర్ కాలనీ లో ఈ నెల 15-02-2023 రోజున భోగ్ భాండార్ అన్నదానం కార్యక్రమం ,ర్యాలీ ప్రజల పెద్ద ఎత్తున తరలిరావాలని ఈ సందర్భంగా తెలియజేశారూ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బంజారా వెల్ఫేర్ కమిటీ నాయకులు లచ్చి రామ్ నాయక్ రామ్ కుమార్ నాయక్ శ్రీను చిన్న ముఖేష్ తదితరులు పాల్గొన్నారూ.