ఈ69న్యూస్ జనగామ

ఈనెల 27న జిల్లావ్యాప్తంగా మండల తహసిల్దార్ కార్యాలయాల ముందు సిపిఎం మండల కమిటీల ఆధ్వర్యంలో జరిగే ధర్నాలు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు ప్రజలకు పిలుపు నిచ్చారు.సోమవారం రోజున స్థానిక సిపిఎం మండల పార్టీ ఆఫీసులో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాపర్తి రాజు పాల్గొని మాట్లాడుతూ..జిల్లా పార్టీ పిలుపులో భాగంగా జిల్లాలో ఉన్న అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో స్థానిక సమస్యలు సర్వే చేయడం జరుగుతుంది గ్రామాలలో సర్వే చేస్తున్న సందర్భంలో సర్వే బృందానికి అనేక స్థానిక సమస్యలు ప్రజల నుండి రావడం జరిగింది.అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క గ్యారెంటీ పూర్తిచేసిన పాపనా పోలేదని ఇందిరమ్మ ఇండ్లు రైతుబంధు రైతు రుణమాఫీ గ్యాస్ సబ్సిడీ ఉచిత కరెంటు రేషన్ కార్డులు అలాగే అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సర్పంచుల పదవులు పూర్తయి స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కావడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిత్తశుద్ధితో ప్రజా సమస్యల పరిష్కరించడం కోసం కృషి చేయాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలు సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లాలో ఎండిపోయిన వారి మొక్కజొన్న ఇతర పంటలకు ఎకరానికి 50 వేల రూపాయల నష్టపరిహారం రైతులకు చెల్లించి ఆదుకోవాలని అన్నారు గ్రామాల్లో పేరుకుపోయిన స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటం ఒకటే మార్గం అని కావున ప్రజలందరూ 27న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ప్రజలను కార్యకర్తలను కోరారు.ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ పార్టీ మండల నాయకులు పొదల నాగరాజు కడారి ఐలయ్య పొదల లవ కుమార్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.