
అక్టోబర్ 1న కోదాడ బాలురు ఉన్నత పాఠశాలలో జరిగే గద్దర్ అన్న యాదిలో సంస్మరణ సభకు యువత కదం తొక్కాలని ఓయూ జేఏసీ నాయకులు కందుల మధు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం తొలి దశ నుండి మలిదశ వరకు జీవితాలను త్యాగం చేసిన ఉద్యమకారుల కుటుంబాలకు సంక్షేమ పథకాల్లో 50 శాతం రిజర్వేషన్ లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను గుర్తించిన రాజకీయ పక్షాలకే భవిష్యత్తులో తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు. ప్రజా సంఘాలు ఉద్యమకారులను గుర్తించే రాజకీయ పక్షాలు అక్టోబర్ 1న కోదాడ లో జరగబోయే గద్దర్ అన్నయ్య యాదిలో సభ లో భాగస్వాములు కావాలన్నారు. అమరుడైన నడిగూడెం విదార్ది నాయకుడు కనకరాజు తెలంగాణ ఉద్యమంలో తమతో కలసి పోరాటం చేసాడని అయన పోరాటానికి చిహ్నంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేసారు. విలేకరుల సమావేశంలో ఓయూ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, మండల కో ఆర్డినేటర్లు మీర్జా మోసిన్ బేగ్,మురళి, వినోద్,రవినాయక్, వీరబాబు, నవీన్, గోపి, సాయిగోపి, క్రాంతి కుమార్, సాయి పలువురు ఉద్యమ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 1న కోదాడ బాలురు ఉన్నత పాఠశాలలో జరిగే గద్దర్ అన్న యాదిలో సంస్మరణ సభకు యువత కదం తొక్కాలని ఓయూ జేఏసీ నాయకులు కందుల మధు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం తొలి దశ నుండి మలిదశ వరకు జీవితాలను త్యాగం చేసిన ఉద్యమకారుల కుటుంబాలకు సంక్షేమ పథకాల్లో 50 శాతం రిజర్వేషన్ లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను గుర్తించిన రాజకీయ పక్షాలకే భవిష్యత్తులో తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు. ప్రజా సంఘాలు ఉద్యమకారులను గుర్తించే రాజకీయ పక్షాలు అక్టోబర్ 1న కోదాడ లో జరగబోయే గద్దర్ అన్నయ్య యాదిలో సభ లో భాగస్వాములు కావాలన్నారు.
అమరుడైన నడిగూడెం విదార్ది నాయకుడు కనకరాజు తెలంగాణ ఉద్యమంలో తమతో కలసి పోరాటం చేసాడని అయన పోరాటానికి చిహ్నంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేసారు. విలేకరుల సమావేశంలో ఓయూ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, మండల కో ఆర్డినేటర్లు మీర్జా మోసిన్ బేగ్,మురళి, వినోద్,రవినాయక్, వీరబాబు, నవీన్, గోపి, సాయిగోపి, క్రాంతి కుమార్, సాయి పలువురు ఉద్యమ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.