తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/డిసెంబర్ 28
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలన్న కేంద్రం ప్రభుత్వాన్ని నిర్ణయం పై జిల్లా కాంగ్రెస్ నాయకుడు కృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించాడు ఈ చర్య దేశ గౌరవాన్ని దెబ్బతీయటమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.