
ఈ69న్యూస్ జఫర్ఘడ్
జనగాం జిల్లా ఉప్పుగల్ గ్రామంలో సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మూడు నెలల ఉచిత టైలరింగ్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు బహుకరించారు.ఈ కార్యక్రమం 134వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని యాటా అశోక్ నేతృత్వంలో జరిగింది.జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి,గ్రామ అధ్యక్షుడు లెంకల రాజు గౌడ,మరియు ఇతర ప్రముఖులు పాల్గొని మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులను అభినందించారు.