
ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావులు సభాస్థలి పరిశీలన
ఈనెల ఐదవ తేదీన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”జరుగుతుంది.ఈ సభలో బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే ఈ సభ నిర్వహణ, ఏర్పాట్లను శుక్రవారం మధ్యాహ్నం ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,నామా నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల ఎన్నికల ఇంఛార్జిలు కోనేరు సత్యనారాయణ, ఉప్పల వెంకటరమణలతో కలిసి పరిశీలించారు, పర్యవేక్షించారు.ఏర్పాట్లలో నిమగ్నమైన వారికి ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావులు పలు సూచనలు చేశారు, సలహాలిచ్చారు.