
ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ జన్మదినోత్సవ వేడుకలు
మాజీ మంత్రి, సీనియర్ శాసన సభ్యులు డీ ఎస్ రెడ్యా నాయక్ జన్మ దినోత్సవ వేడుకలు ఆదివారం చిన్న గూడూరు మండలం ఉగ్గం పల్లి లో ఘనంగా జరిగాయి . జిల్లా గ్రంథాలయం చైర్మన్ నవీన్ రావు,మాట్లాడుతూ డోర్నకల్ నియోజక వర్గాన్ని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ హాయంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచారని,నిస్వార్థ రాజకీయ నాయకునిగా నియోజక వర్గంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారని,అట్లాటి నాయకులు రెడ్యా నాయక్ అన్నారు, నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో జీవిస్తూ ఇంకా మన నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసేలా ఆయనను దేవాది,దేవతలు దీవించాలన్నారు.మంచి నాయకులుగా ఆయనను శాసన సభలోనే గుర్తించారని,మళ్ళీ ఒకసారి ఆయనను గెలిపించి అభివృద్ధికి ఆటంకం జరగకుండా కొనసాగించు కుందామన్నారు. నూరేళ్లు సుఖసంతోషాలతో జీవితాంతం ఆయురారోగ్యంతో ఉండాలని ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఎన్నికై క్యాబినెట్ మంత్రిగా చూడాలని డోర్నకల్ ప్రజల ఆకాంక్ష అన్నారు, రామడుగు అచ్యుత రావు నేతృత్వంలో బారీ గజమలతో శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరుణ రాంబాబు,జడ్పిటిసి శారద రవీందర్,మరిపెడ మున్సిపాలిటీ చైర్మన్ సింధూర రవి నాయక్,వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్,మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న,మాజీ ఓడిసిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు అజ్మీరా రెడ్డి,మరిపెడ మున్సిపాలిటీ కౌన్సిలర్ పానుగోతు సుజాత వెంకన్న, స్రవంతి భద్రయ్య,ఉరుగొండ శ్రీనివాస్,కౌసల్య గణేష్,కో ఆప్షన్ సభ్యులు మక్సూద్, పద్మశాలి సంఘం అధ్యక్షులు దిగజర్ల శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి, కృష్ణ, భాస్కర్,తదితరులు పాల్గొన్నారు.