
ఎమ్మెల్యేకీ ధన్యవాదలు
వంచనగిరిలో 2ఎకరాల ప్రభుత్వ భూమిని ఖాబ్రస్తాన్ కు కేటాయించడాన్ని హర్షం వ్యక్తం చేసిన-ముస్లిం ప్రజలు వరంగల్ జిల్లా కలెక్టర్ గీసుగొండ మండల తహసీల్దార్ మరియు జిల్లా పరిపాలనకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గీసుగొండ మండల ముస్లిం ప్రజలు అన్నారు.
ముఖ్యంగా జానపాక ఆదర్శ్ నగర్ ప్రజలు చాలా సంవత్సరాలుగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సమీపంలో సరైన సమాధి స్థలం లేకపోవడం వల్ల వారిని దూర ప్రాంతాలకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చేదని వారు బాధను వ్యక్తం చేశారు. ఇది వారికి ఎన్నో ఆర్థిక,మానసిక కష్టాలను కలిగించిందని అన్నారు. అంతేకాకుండా శ్యాంపేట్, వంచనగిరి,కొనయమాకుల,అనంతారం,గీసుగొండ గ్రామాల ప్రజలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని అక్కడి ముస్లిం సమాజం యొక్క వాదనగా ఉండేదని అన్నారు.ఈ పరిస్థితిని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గుర్తించి, గీసుగొండ మండలంలోని వంచనగిరి గ్రామంలో సర్వే నంబర్ 67/2లో ప్రభుత్వ భూమి 2 ఎకరాలను ఖబ్రస్తాన్ స్థాపన కోసం కేటాయించడానికి జిల్లా కలెక్టర్,ఎమ్ఆర్ఓ చూపిన చొరవ మరియు తీసుకున్న నిర్ణయం ఒక శాశ్వత పరిష్కారంగా నిలిచిందని వారు సంతోషించారు.ఈ నిర్ణయం మా సమాజంలోని సుదీర్ఘకాలిక సమస్యను పరిష్కరించడమే కాకుండా,భవిష్యత్ తరాలకు కూడా ఎంతో ఉపయోగకరమైందని అన్నారు. ప్రజల కష్టాన్ని అర్థం చేసుకుని,తక్షణ చర్య తీసుకున్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్,తహసీల్దార్ గార్లకు సానుభూతి,కరుణాభావం, ప్రజల పట్ల ఉన్న బాధ్యత నిజంగా ప్రశంసనీయమని గీసుగొండ ముస్లిం సమాజం అన్నారు.మా సమాజం తరపున ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, తహసీల్దార్ కీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గొప్ప సహాయాన్ని ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని హర్షం వ్యక్తం చేశారు