
నర్మెట్ట మండల తహసిల్దార్ గారికి వినతి పత్రం ఇస్తున్న తెలంగాణ రైతు సంఘం నాయకులు
నర్మెట్ట: ఏండ్ల తరబడి సాగులో ఉన్న గిరిజన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నర్మెట్ట మండల తహసిల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ మాట్లాడుతూ నర్మెట్ట మండలం మచ్చుపాడు రెవెన్యూ పరిధిలోని ఇసుక బాయ్ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సంగడి తండకు చెందిన గిరిజన రైతులు మూడు తరాల నుండి సుమారు 80 సంవత్సరాలుగా సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో 9మంది గిరిజన రైతులు కబ్జా కాస్తులో ఉండి వారసత్వంగా కుటుంబాలు సాగు చేసుకుంటు జీవితాలను పోషించుకుంటూ వారి కుటుంబాలు ఇట్టి భూమి నుండి సాగుచేయగా వచ్చే పంటపై ఆధారపడి, వచ్చే డబ్బులపై మా కుటుంబ అవసరాలను తీర్చుకుంటూ జీవిస్తున్న కడు నిరుపేదలని. గత జూన్ నెల నుండి పారెస్ట్ అధికారులు అట్టి భూమిని ఫారెస్ట్ భూమి అని తక్షణమే వదిలిపెట్టాలని బెదిరింపులకు దిగారని ఇట్టి విషయంలో గతంలో మా వద్ద ఉన్న ఆధారాలు ఉర్దూలో ఉండడంతో చదువు రాక అట్టిక ఆయుధాలను అధికారులకు చూపించామని వారు ఈ కాగితాలు ఆధార్ కార్డు ఇస్తే మీకు పట్టా చేస్తామని చెప్పి అట్టి భూమిలో మమ్ములను రాన్వికుండా అడ్డు అడ్డుకుంటున్నారని ఎన్నో సంవత్సరాల నుండి అట్టి భూమిని నమ్ముకొని జీవిస్తున్న మాకు ఆ భూమిలో సేద్యం తప్ప మరొకటి మాకు తెలియదని కాబట్టి పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పట్టా సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా ఇక్కడ వ్యవసాయం చేసుకున్నటువంటి గిరిజనులకు పట్టాదారు వారు పుస్తకాలు ఇవ్వాలని మానవతా దృక్పథంతో జిల్లా కలెక్టర్ ఆర్ డి ఓ స్పందించి వీరికి న్యాయం చేయాలని కోరారు ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన కాగిదాలను పరిశీలించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని అట్టి భూమిలో వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించాలని తెలియజేశారుఈ కార్యక్రమంలో లాకావత్ రుక్కమ్మ,అజ్మిర చందు,
లాకావత్ విఠల్, లకావత్ మోతిలాల్,బానోతు నర్సింహులు,అజ్మీరా బాపులాల్,లకావత్ రాజు కుమార్,భూక్యా రాములు,నేనావత్ విజయ తదితరులు పాల్గొన్నారు