
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పదవతరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు అందజేత
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల లోని అడ్డగూడూర్ , చౌల్ల రామారం , డి రేపాక ,ఆజింపేట, లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదివే విద్యార్థులకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పిఎసిఎస్ అడ్డగూడూరు మండల వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య సహకారంతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 23న భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు మరియు పెన్నులు అందజేశారు
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో భయభ్రాంతులకు గురి కాకుండా పట్టుదలతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని భగత్ సింగ్ స్ఫూర్తితో లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు
విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, రామలింగయ్య ,శివాజీ, యాదగిరి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సూరారం జానీ, అడ్డగూడూరు మండల నాయకులు పిల్లి సతీష్, విద్యార్థులు సిహెచ్ బన్నీ సిహెచ్ సన్నీ ఎస్ మచ్చ గిరి ఎన్ నవదీప్ ఏం ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు