
ఈ69న్యూస్:-హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని చారిత్రాత్మకమైన శ్రీ ముఖ్యనాథస్వామి దేవాలయంలో మొట్టమొదటి సారిగా నిర్వహించబడుతున్నశ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంకు స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మరియు ధర్మసాగర్ సీఐ అడ్డూరి ప్రవీణ్ కుమార్ మరియు ఎస్ఐ ఎక్కిరాల నరసింహ రావుని ముప్పారం గ్రామం మాజీ ప్రజా ప్రతినిధులు,ఆలయ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి ఈ నెల 06వ తేదీన నిర్వహిస్తున్న శ్రీ రామ నవమి మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు గోనెల సమక్క రాజయ్య,గై కృష్ణమూర్తి,మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్,మాజీ వార్డ్ మెంబర్ కొరిమి సతీష్, సీనియర్ నాయకులు గొనేల మల్లయ్య,ఆలయ చైర్మన్ శివసాని ప్రవీణ్,ఉపాధ్యక్షులు గుంటీపల్లి సంపత్ కుమార్,కోరుకొప్పుల అనిల్ కుమార్,సభ్యులు మేకల శ్రీకాంత్,గూల్ల కొమురయ్య,ధర్మకర్తలు మర్రిపల్లి వెంకటస్వామి,ఎర్ర చేరాలు,కందుకూరి రమేష్,కంధారపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.