
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్:మాదిగ జాతి అధినేత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 30 ఏళ్లుగా చేస్తున్న వర్గీకరణ పోరాటం చట్ట రూపం దాల్చి విజయం సాధించిన సందర్భంలో మరియు మందకృష్ణ మాదిగ చేసిన సామాజిక పోరాటాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇటీవల పద్మశ్రీ అవార్డును కృష్ణ మాదిగ కం ప్రకటించిన సందర్భంలో ఏప్రిల్ 12 వ తారీఖున స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో భారీ సన్మాన సభను ఏర్పాటు చేస్తున్నారు.ఆ సన్మాన సభ విజయవంతానికై శనివారం
జఫర్గడ్ మండల కేంద్రంలో జఫర్గడ్ మాజీ ఎంపీపీ గాదెపాక అయోధ్య అధ్యక్షతన అన్ని పార్టీల మాదిగ రాజకీయ నేతలు యువకులు నియోజకవర్గ ఐక్యవేదిక నాయకులు ఎంఆర్పిఎస్ శ్రేణులు కలిసి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మాజీ జెడ్పి స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి మాట్లాడుతూ..ఈనెల 12న జరగబోయే సన్మాన సభకు జఫర్గడ్ లోని అన్ని గ్రామాల నుంచి మాదిగలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అతీతంగా మాదిగ రాజకీయ నాయకులు సన్మాన సభ విజయవంతానికి కృషి చేయాలని సభ విజయవంతానికి పనుల్లో నిమగ్నమై ఉండాలని చర్చించుకున్నారు.ఈ కార్యక్రమంలో జఫర్గడ్ మాజీ జెడ్పిటిసి కాసర్ల దర్గయ్య,మాజీ ఎంపీపీ గబ్బెట బుచ్చయ్య,మాజీ సర్పంచ్ గాదేపాక చిరంజీవి,మాజీ ఎంపిటిసి రడపాక ఇంద్రయ్య,మారపల్లి కరుణాకర్,రడపాక డానియల్,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గాదేపాక మహేందర్,ఎమ్మెస్పీ మండల అధ్యక్షుడు ఇల్లందుల రాంబాబు సీనియర్ నాయకులు ఎల్లస్వామి మాదిగ,గంగాధరి రవీందర్,తాటికాయల హరికృష్ణ,ఇల్లందుల సంపత్ మరియు నియోజకవర్గ మాదిగ ఐక్యవేదిక నాయకులు సింగపురం జగన్,మాజీ జెడ్పిటిసి గుర్రం యాదగిరి,ఇల్లందుల సుదర్శన్ మాజీ ఎంపీపీ రాజారపు యాదగిరి,బొడ్డు ప్రభుదాస్,అనంతపురం కమలేష్ మారపల్లి ప్రసాద్,పుట్ట నవీన్,తదితరులు పాల్గొన్నారు.