
ఈ69న్యూస్ ఐనవోలు
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో బీసీలకు 42 శాతం అలాగే ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా నంది బొమ్మ దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని నినాదం చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.చేశారు.అనంతరం మండల పార్టీ అధ్యక్షులు సమ్మెట మహేందర్ గౌడ్ రాష్ట్ర నాయకులు రాయపురం సాంభయ్య మీడియాతో మాట్లాడారు.ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద ఆరోపణలు మాని అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందినది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంటెస్టెడ్ జెడ్పిటిసి పోలేపల్లి బుచ్చిరెడ్డి, బీసీ అధ్యక్షులు రావుల రవి, ఎస్సీఅధ్యక్షులు యాత్ర సాంబయ్య, మైనార్టీ అధ్యక్షులు రహీపాషా, మహిళా అధ్యక్షులు ఇల్లందురేలీషా, యూత్ అధ్యక్షులు కత్తి సుధీర్, గ్రామ పార్టీ అధ్యక్షులు బరిగల భాస్కర్, మండల ప్రధాన కార్యదర్శి కొత్తూరు సునీల్, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
