
badrachalam news
ఏ సమస్య వచ్చిన మీకు అండ దండ గా ఉంటా – యం ఎల్ ఏ
భద్రాచలం మండలం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ట్రేడ్ ఎలక్ట్రికల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చుక్క సుధాకర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఎలక్ట్రికల్ యూనియన్ సమావేశంలో మిత్రులకు ఏ సమస్య వచ్చినా వారికి అండదండలుగా ఉంటానని తెలియజేశారు. యూనియన్ మిత్రులు గత ఎన్నికల్లో కష్టపడి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. యూనియన్ సభ్యులు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, చింతాడి చిట్టిబాబు జాయింట్ సెక్రెటరీ రాజీవ్, రత్నం రజనీకాంత్, నాయకులు పెద్దినేని శ్రీనివాస్, ఎలక్ట్రికల్ యూనియన్ చీపుర్ల శ్రీనివాస్, రహీం, యూత్ అధ్యక్షులు గాడి విజయ్, కార్యదర్శి ఆకుల వెంకట్, కోశాధికారి మాచినేని భాను, ఉపాధ్యక్షులు నాగేంద్ర, రౌతుల శ్రీరామ్, మహిళా మండల అధ్యక్షురాలు జాస్తి గంగా భారతీ, మహిళా జాయింట్ సెక్రెటరీ పిట్టల లక్ష్మీకాంతం, విజయలక్ష్మి, మహిళ నాయకురాలు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..