26/11/2022
ఈ 69న్యూస్
వరంగల్
కందుగుల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగావిద్యార్థులకు ఓటు హక్కు అవగాహన కల్పించడం జరిగినది
భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ‘కందుగుల’ లో నమూనా ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పడిదం బక్కారెడ్డి ZPTC గారు హజరై పిల్లలు విద్యార్థి దశ నుండి ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమం పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీ ఓరుగంటి తిరుపతి ఆధ్వర్యంలో
ప్రదానోపాధ్యాయులు శ్రీ S. మహేందర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ ప్రభావతి గారు, MPTC పద్మగారు, రాజిరెడ్డి, మధుసూదన ఉపసర్పంచ్ బెల్లి రాజయ్య గారు, SMC చైర్మన్ హేమలత గారు మరియు ఉపాధ్యాయులు శారద, మమత, నందన, సమ్మయ్య గార్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల రాజిరెడ్డి గారు. సౌండ్ బాక్స్ పాఠశాలకు వితరణ చేశారు. చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఓటు వేయడం జరిగినది