
షెడ్యూల్డ్ జీవో లు సవరించి,హై కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు పెంచాలని షెడ్యూల్డ్ జీవో లు సవరించి,హై కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు పెంచాలని
రాష్ట్రంలో 73 షెడ్యుల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాల సవరణ కొరకు తేది: 23-01-2014 నుండి తేది:03-02-2021 మధ్యకాలంలో కనీస వేతనాల సలహా మండలిలో చర్చించి కొన్ని ప్రతిపాదనలు ఫైనల్ చేశారు. to Gov. వాంటో భాగంగా జూన్ 2021లో 5 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్కు ఫైనల్ జీఓలను జారీ చేశారు. వాటికి వెంటనే గెజిట్ చేయాలని, మే 2021లో లేబర్ కమీషనర్ కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలుగా పంపిన 12 20 డ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లకు ఫైనల్ జీఓలు జారీ చేసి, వాటికి వెంటనే గెజిట్ చేయాలని, వాటితో పాటు ఇప్పటివరకు W సలహా మండలిలో అనేకసార్లు చర్చలు జరిపి అన్నిరకాల ప్రక్రియలు, లాంచనాలు పూర్తిచేసుకొని కమీషనర్ కార్యాలయంలో Rene Bar ఫండింగ్‌లో ఉన్న 56 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ తుది ప్రతిపాదనలను వెంటనే తెప్పించుకొని ఫైనల్ జీఓలను ఇచ్చి వాటికి కూడా గెజిట్ చేయాలని కోరుతున్నాము. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం ప్రతి 5 సం॥లకు ఒకసారి పెంచాల్సి వుంది. కానీ 2006-2012 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే జీఓలకు సవరణలు చేశారు. మళ్ళీ ఇప్పటిదాకా షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లలో కనీస వేతనాలు సవరించలేదు. ఈ అంశంపై రాష్ట్రంలోని కార్మికులు, కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. 2021 జూన్ మాసంలో 5 రంగాల షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ జీవో ఎంఎస్ నెం.21 సెక్యూరిటీ సర్వీసెస్, జీఓ నెం.22 కన్స్ట్రక్షన్ & మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆపరేషన్స్, జీఓ నెం. 23 స్టోన్ బ్రేకింగ్, జీఓ నెం.24 ప్రాజెక్టులు, డ్యామ్స్ మొదలైనవి, జీఓ నెం. 25 ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగాల్లో కనీస వేతనం అన్స్కల్డ్ వర్కర్‌కు రూ.18,019/-లకు, మాగ్జిమం హైలీస్కిల్డ్ వర్కర్‌కు రూ.39,837/- లుగా నిర్ణయించారు. కరువుభత్యం పాయింట్ల యొక్క రేట్లు కూడా అన్ స్కిల్డ్ వర్కర్ రూ.12/-లు, హైలీస్కిల్డ్కు రూ.26.55 ప్రతిపాదించారు. ఈ జీఓలను గెజిట్ చేయాలని కోరుతున్నాము. కావున తమరు జోక్యం చేసుకొని జాప్యం లేకుండా 68 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్లోని జీఓలను వెంటనే ఇచ్చి, గతంలో 2021లో ఇచ్చిన 5 జీఓలతో సహా మొత్తం 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్లను వెంటనే గెజిట్‌లో ముద్రించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.