కబడ్డీ పోటీల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర
చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో గ్రామ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ, క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ,ఐక్యత, పోటీ తత్వం పెంపొందడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని అన్నారు.గ్రామీణ స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కబడ్డీ పోటీల నిర్వహణకు ప్రోత్సాహకంగా నిర్వాహకులకు రూ.4,016 నగదు అందజేసి అభినందించారు. అలాగే పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరినీ ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ పోటీల్లో ఎస్వీపీఎస్ స్కూల్ ఓడితల టీమ్ ప్రథమ బహుమతి రూ.10,016 గెలుచుకోగా,జడలపేట గ్రామ టీమ్ ద్వితీయ బహుమతి రూ.5,016 గెలుచుకుంది.విజేతలైన జట్లను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి అభినందించి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు