కమ్యూనిస్టులతోనే ప్రజా సమస్యలు పరిష్కారం
ఈరోజు గుండెపుడి శాఖ సమావేశం బయ్య సురేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిధిగా సిపిఎం మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను వీడనాడకుంటే రానున్న రోజులలో పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని అన్నారు, పాలక పార్టీలు ఎన్నికల వరకే ప్రజలను వాడుకొని తర్వాత ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని అన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు, బిజెపి దేశ సంపదను ఆధాని అంబానీలకు కట్టబెడుతూ సమాజంలో ఆర్థిక సమాన తలను మరింత పెంచుతుందన్నారు, మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తుందన్నారు, మతపరమైన చీలిక తెచ్చి రాజకీయ లబ్ధి పొందుతుందని దీనికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు, భారతదేశంలో మతోన్మాద పాలకులు ప్రజల మధ్య చిచ్చు పెడుతూ అనేక హామీలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు సమాజంలో అంతరాలు ఉన్నంతవరకు ఎర్రజెండా పోరాడుతూనే ఉంటుందన్నారు, కమ్యూనిస్టు పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం ఎదిరించడం, పోరాటం పరిష్కారం సాధించడం నేర్పింది కమ్యూనిస్టు పార్టీ ఎవరికి కష్టమొచ్చినా అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడి సిపిఎం పోరాడుతుందన్నారు,బిజెపి పాలకులు ప్రశ్నించే గొంతుకులను నొక్కుతూ రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు, సిపిఎం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పరిరక్షణ కోసం ఎల్లప్పుడూ పోరాడుతుందని అన్నారు,సిపిఎం పార్టీ కి త్యాగ చరిత్ర ఉందని ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు, మతోన్మాదానికి చెక్ పెట్టడానికి పిడికిలి బిగించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో గుండెపూడి ప్రధాన కార్యదర్శి బోడపట్ల రాజశేఖర్, శాఖ కార్యదర్శి షేక్ షరీఫ్, కందాల రమేష్, అల్లి శ్రీనివాస్ రెడ్డి, యామిని నారాయణ, వడ్లకొండ ఉప్పలయ్య,పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.