
కాంగ్రెస్ పార్టీ విజయ భేరి సభను విజవంతం చేయండి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేడు రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడలో నిర్వహించనున్న విజయ భేరి సభను విజయవంతం చేయాలని, నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూతుకూరి వెంకట్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు ,ప్రజా సంఘాలు,అనుబంధ సంఘాల నాయకులు హాజరై సోనియమ్మ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యo వస్తుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఆయన కోరారు.