
కాంగ్రెస్ పార్టీ విజయభేరి విజయోత్సవ ర్యాలీ
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో నిన్న తుక్కుగూడ విజయభేరి సభలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియ గాంధీ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ కార్డుల పంపిణి టిఫిసిసి మెంబర్ డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ చౌరస్తా నుండి కార్గిల్ సెంటర్ వరకు భారీ ర్యాలీతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, అస్సాం రాష్ట్రం మాజీ హోo మంత్రి భూపెన్ కుమార్ బోర హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భూపెన్ కుమార్ ను శాలువాతో సన్మాంచి, ఘన స్వాగతం పలికిన రాంచందర్ నాయక్ నాయక్. అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు అంశాలను ప్రజలకు వివరిస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి ప్రజల కు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా చేశారు అని మండి పడ్డారు, డోర్నకల్ నియోజకవర్గ ని అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి అంటే మళ్లీ డోర్నకల్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగర వెయ్యాలని డోర్నకల్ కు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలను కోరారు అధికార పార్టీ నాయకులు ఇన్ని రోజులు అభివృద్ధి చేసిన మని చెప్పారు తప్ప ఏమీ అభివృద్ధి చేయలేదని అన్నారు, దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీని ప్రభుత్వం తీర్చలేక పోయిందన్నారు, నిరుద్యోగులకు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఈ రోజుల్లో ఒక ఊరికి ఒక ఉద్యోగం రాలేదన్నారు, వచ్చే ఏడాది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలను వివరిస్తూ
1)మహాలక్ష్మి మహిళలకు ప్రతినెల ₹2500/-,₹500లకే గ్యాస్ సీలిండర్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.
2)రైతు భరోసా ప్రతి ఏటా ₹15000రైతులు, కౌలు రైతులకు
₹12000 వ్యవసాయ కూలీలకు
వరి పంటకు ₹500 బోనస్
3) గృహ జ్యోతి ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
4)ఇందిరమ్మ ఇండ్లు ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉంటే ₹5లక్షలు, ఉద్యమకారులకు 250 చ.గ. ఇంటి స్థలం.
5)యువ వికాసం విద్యార్థులకు ₹5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నెషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంది.
6)₹4000నెలవారీ పింఛను
₹10లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమా వంటి పథకాలు,
ఈ 6గ్యారంటీ కార్డులను గడప గడపకు తిరిగి పంపిణి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అందిస్తుందని ప్రజల కు తెలియజేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి, ఎల్ హెచ్ పి ఎస్ జాతీయ నాయకులు బెల్లయ్య నాయక్, డోర్నకల్ నియోజకవర్గ లో ని ఏడు మండల ల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఎస్సీ సెల్ నాయకులు, ఎస్టీ సెల్ నాయకులు, మరిపెడ బాధ్యులు తాజుద్దీన్, అప్సర్, ఐలమల్లు, యువత,మహిళలు, అభిమానులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.