కాంగ్రెస్ పార్టీని విడిచి బిఆర్ఎస్లో చేరికలు
రేగొండ మండలం రూపీరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముడతనపెల్లి కుమారస్వామి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆకర్షితులు అయ్యే నాయకులు, కార్యకర్తలు భారీగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీ బలోపేతానికి కొత్తగా చేరిన నాయకుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.కుమారస్వామి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వమే పనిచేసిందని, అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు పంచగిరి సుధాకర్, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, మేడిపల్లి అశోక్, కొండా సురేందర్, పన్నాటి శ్రీనివాస్, కనుకుంట్ల దేవేందర్, రూపిరెడ్డి భగవాన్ రెడ్డి, చంద్రారెడ్డి, మేడిపల్లి ప్రభాకర్, రియాజ్, రావుల రమేష్, సరువు రాజు, వెంకటేష్, రావుల రజినీకాంత్, సదాశివచారి, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు