
కళలను ప్రోత్సహిస్తున్న ఈ69 న్యూస్ కు కృతజ్ఞతలు-రహీం
జిల్లా అధ్యక్షులు రహీం పాష
కళలను ప్రోత్సహిస్తున్న ఈ69 న్యూస్ కు కృతజ్ఞతలు-రహీం
తెలుగు గళం స్టేషన్ ఘనపూర్
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం జనగామ జిల్లా వాయిద్య కళాకారుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ రహీం కోరారు.స్టేషన్గన్పూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రహీం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ జిల్లాలో సుమారు 5 వేల పైచిలుకు వాయిద్య కళాకారులు ఉన్నారని వారు గత కొన్ని ఏళ్లుగా వాయిద్య కళను ఆదేరువుగా చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుందని అన్నారు. వాయిద్య కళాకారులు నిరుపేద కుటుంబాలుగానే మిగిలారని వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.ఈ69 న్యూస్ యాజమాన్యం ప్రోత్సాహంతో మాకు కళాకారులుగా గుర్తింపు వచ్చిందని అందుకు గాను ప్రభుత్వం కొంత మందికి ఐడి కార్డులు కూడా జారీ చేసిందని ఇంకొందరికి జారీ అవ్వాల్సి ఉందని అన్నారు.ఈ సందర్భంగా ఈ69 న్యూస్ చానెల్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షుడు అఫ్జల్ మియా,ఇప్పగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు డబ్బ రాములు,కోశాధికారి మర్రి పరషరాములు,సహాయ కార్యదర్శి మాదార్ గౌరవ అధ్యక్షుడు యాకూబ్ అలీ,కో ఆప్షన్ మెంబర్ మహబూబ్ పాషా,కొలిపాక బాను చందర్,మైబెల్లి,ఇబ్రాహీం,రజాక్,హుస్సేన్ సుధాకర్ నరేష్ అబ్బాస్ అలీ సయ్యద్,పద్మాకర్,పర్నేస్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.