కాంగ్రేస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తలు
- కాంగ్రేస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తలు
•కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తాం
తెలుగు గళం న్యూస్ వర్దన్నపేట/డిసెంబర్ 2
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కట్రీయాల గ్రామములో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సుల్తాన్ దుర్గమ్మతో పాటు10 వార్డు సభ్యుల గెలుపే లక్ష్యంగా కట్ర్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలం కలిసికట్టుగా సమన్వయంతో పని చేస్తున్నాం.అందులో భాగంగానే ఈ రోజు కట్ర్యాల గ్రామంలోని ఎస్సీ కాలనీ 7&8 వార్డులలో కాంగ్రేస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బండారి సతీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు అందరం కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దుర్గమ్మ సుల్తాన్ గారితో పాటు వార్డ్ మెంబర్స్ అభ్యర్థులను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 7&8 వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగినది. కట్ర్యాల గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు దళిత కాలనీ నుండి 10 కుటుంబాలు1, ఇరుకు శ్రీధర్,2, ఇరుకు యాకయ్య,3, తుమ్మల రాజు,4, ముత్యాల కుమారస్వామి,5, తుమ్మల రమేశ్,6, ముత్యాల అశోక్,7, తుమ్మల నాగేంద్ర బాబు,8, ఇరుకు భాస్కర్,9, తుమ్మల సంతోష్,10, ముత్యాల సంజీవ/- పోషేలెయ్య 50 ఓటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది.
వర్ధన్నపేట మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు బండారి సతీష్ గౌడ్ & మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి అక్బర్& జిల్లా సీనియర్ నాయకులు గుజ్జ రవీందర్ రెడ్డి గార్లు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగినది.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ…రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రేస్ ప్రభుత్వం అమలు చేస్తున్న *రైతు భరోసా ద్వారా సంవత్సరానికి ఎకరానికి 12000/- పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, వ్యవసాయానికి నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం లాంటి పథకాలకు ఆకర్షితులై అదేవిధంగా ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు వర్ధన్నపేట నియోజకవర్గంలో చేస్తున్నా అభివృద్ధిని చూసి అదేవిధంగా ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు నాయకులకు కార్యకర్తలకు ఇస్తున్న ప్రాధాన్యతను గమనించిన వారు ఈ రోజు బిఆర్ ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది.గ్రామం నుండి దళిత కాలనీ నుండి బి.ఆర్.ఎస్ కార్యకర్తలు కాంగ్రేస్ పార్టీలో చేరిని విషయాన్ని ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానివ్వండని ఆదేశించడం జరిగింది.ఈకార్యక్రమములో ,మహిళా మండల నాయకురాలు తీగల సునీత గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తాటికాయాల కుమారస్వామి,కొండేటి మధుకర్,ఎండి వలి పాషా, 1 వ,వార్డు సభ్యులు నాంపెల్లి రవీందర్,2 వ వార్డు సభ్యులు రషీద్,3 వ వార్డు సభ్యులు 7 వ వార్డు సభ్యులు ఎలికట్టే చిన్న రాజు,8 వ వార్డు సభ్యులు ఇటికాల శ్రీలత కార్యకర్తలు ఎండి వలి పాషా, బండారి శ్రీనివాస్ గౌడ్,బండారి వెంకన్నా గౌడ్,గ్యార భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.