
రాష్ట్రంలోనే ఈ కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ అసోషియేషన్ పేరు ప్రఖ్యాతలు సాధించి ఆదర్శంగా నిలవాలి.. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశం నాయిని రాజేందర్ రెడ్డి….
హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు & కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ అసోషియేషన్ గౌరవ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…
కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ అసోషియేషన్ ఏర్పాటు అయి గత 30 సంవత్సరాలుగా ఉంది.
గతంలో ఒకరిద్దరు ఈ కాకతీయ ఈ కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ అసోషియేషన్ నుండి వేరే ఆటో డ్రైవర్స్ యూనియన్ అసోషియేషన్ కు వెల్లి విలీనం చేసినామని అన్నారు
ఈ కాకతీయ ఈ కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ అసోషియేషన్ ఎక్కడా విలీనం కాలేదు.
ఒకరిద్దరు వెళ్ళినంత మాత్రాన అసోషియేషన్ ఎక్కడికి వెల్లలేదు.
కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ అసోషియేషన్ రెగ్యులరైజ్ కూడా చేసుకోవడం జరిగింది.
కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ అసోషియేషన్ ను పునర్నిర్మాణం చేయడంలో భాగంగా ఆటో డ్రైవర్ లు అందరు కలిసి తమ తమ అడ్డాలల్లో యూనియన్ లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
అందులో భాగంగా కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ అసోషియేషన్ పునర్నిర్మాణం చేసి జిల్లా అధ్యక్షునిగా రాయికంటి రఘు, గౌరవ అధ్యక్షునిగా నాయిని రాజేందర్ రెడ్డిని ముఖ్య సలహాదారునిగా ఎం.దేవేందర్ రెడ్డి, గౌరవ లీగల్ సలహాదారునిగా తోట రాజ్ కుమార్ ను ఎన్నుకొని కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
రాష్ట్రంలోనే ఈ కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ అసోషియేషన్ పేరు ప్రఖ్యాతలు సాధించి ఆదర్శంగా నిలుచునే విధంగా ఈ యూనియన్ నిలబడాలి.
అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఈ అడ్డాలు ఏర్పాటు చేసుకోవడానికి కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆహ్వానించడం జరుగుతుంది.
అడ్డాల్లో యూనియన్ లు ఏర్పాటు చేసుకోవడం వల్ల వారు తమ సమస్యలను ఐక్యంగా ముందు ఉంది పోరాడటానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు.
ఆటో కార్మికులకు ఏమైనా ఇబ్బంది జరిగిన వారికి ఆదుకోవటాని కోసం పెద్ద మొత్తంతో ఒక పొడుపు సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది
జిల్లా ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా ఆటో యూనియన్ వారికి సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా డ్రెస్ కోడ్ మైంటైన్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తూ సోదర భావంతో మేలుగుతామని ఆటో యూనియన్ కూడా ఒక సూచన చేయడం జరిగింది
ఈ సమావేశంలో కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ అసోషియేషన్ జిల్లా అద్యక్షులు రాయికంటి రఘు, ముఖ్య సలహాదారునిగా ఎం.దేవేందర్ రెడ్డి, గౌరవ లీగల్ సలహాదారు తోట రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు కాందారి రమేష్, మర్రిపెల్లి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శులు ఎం.డి. షఫీక్ అహ్మద్, భూక్య రామకృష్ణ, కార్యదర్శులు ఎం.డి. ఖదీర్, బోట్ల వరప్రసాద్, కోశాదికారి నెకావాత్ శంకర్, బైరి రమేష్, ప్రచార కార్యదర్శులుగా బోనగిరి భద్రయ్య, సంధ్యల శోభన్ బాబు, కార్యవర్గ సభ్యులు ఎస్.కే.బాబా, జక్కు శ్రీను, ముంజ తిరుపతి, కోరిమి నరేష్, మువ్వ శ్రీను, గోపరాజు యాకయ్య, సయ్యద్ గౌస్, భూక్య నరేష్, బోనగిరి శ్రీధర్, తంగెళ్ళపల్లి కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, గ్రేటర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొంత సారంగం తదితరులు పాల్గొన్నారు.