
కాజీపేట ఆర్ఓబి పనుల పర్యవేక్షణలో ఎమ్మెల్యే నాయిని
కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి) నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు వేగవంతం చేయాలని ఆయన అధికారులు ఆదేశించారు.ఇప్పటికే మొదటి వంతెన పనులు పూర్తికాగా,రెండో వంతెన నిర్మాణం కొంతవరకు కొనసాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.రవాణా సౌకర్యాలు మెరుగుపడేందుకు,ట్రాఫిక్ భారం తగ్గేందుకు పనులను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.పాత వంతెన మరమ్మత్తు కోసం ప్రభుత్వం రూ.59 లక్షల నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించి వంతెనను మరింత సురక్షితంగా మార్చాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు,అధికారులు,స్థానికులతో కలిసి పాత వంతెన వద్ద మరమ్మత్తు పనులను పరిశీలించి సూచనలు చేశారు.నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,అధికారులు పాల్గొన్నారు.