కామ్రేడ్ ఉల్లి వెంకటయ్య స్మారకార్థం క్రీడోత్సవాలు
డివైఎఫ్ఐ,ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడోత్సవాల ప్రారంభం స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని డివైఎఫ్ఐ,ప్రజానాట్యమండలి గ్రామ కమిటీల ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ ఉల్లి వెంకటయ్య స్మారకార్థంగా రెండు రోజులపాటు నిర్వహించనున్న సంక్రాంతి క్రీడోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్,గ్రామ సర్పంచ్ మందపురం రాణి అనిల్,ఉపసర్పంచ్ లింగనబోయిన రాజులు కబడ్డీ,వాలీబాల్ ఆటలను ఆడి క్రీడోత్సవాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మునిగెల రమేష్ మాట్లాడుతూ యువత శారీరక,మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.క్రీడల్లో స్నేహపూర్వక పోటీ తత్వం ఉండాలని,యువత సమాజ ప్రగతి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.మత్తు పదార్థాలు,డ్రగ్స్‌కు దూరంగా ఉండి శక్తివంతమైన,ఆరోగ్యవంతమైన యువకులుగా ఎదిగి భావి భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.ప్రతి సంవత్సరం గ్రామంలో ఈ తరహా క్రీడోత్సవాలు నిర్వహించడం గర్వకారణమని పేర్కొంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న డివైఎఫ్ఐ,ప్రజానాట్యమండలి గ్రామ కమిటీలను అభినందించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ,ప్రజా సంఘాల నాయకులు కుర్ర ఉప్పలయ్య,తొడెంగల ఐలయ్య,కత్తుల రాజు,మంద మహేందర్,గట్ల మల్లారెడ్డి,డివైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి నీరటి సంపత్,ప్రజానాట్యమండలి గ్రామ కార్యదర్శి లింగనబోయిన శ్రీకాంత్,కాసాని రమేష్,సీనియర్ క్రీడాకారుడు దార్నం శ్రీధర్,వంగపండ్ల సోమయ్య,నెలమంచ రాంరెడ్డి,రామగోని సతీష్,పోలాస్ కిష్టయ్య,దాసరి కొమురయ్య,గోడిశాల యాదగిరి,సట్ల రాజు,దైద కుమార్,మేదరవైన కరుణాకర్,పోలసు పద్మాకర్,మంద మొగిలి,అన్నేపు రాజు,మంద రాజు,పిట్టల నగేష్,అన్నేపు అనిల్ రాజు,నిమ్మల రాజు తదితరులు పాల్గొన్నారు.