
telugu galam news e69news local news daily news today news
గళం న్యూస్:ములుగు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మరియు ములుగు నియోజకవర్గ కో – ఆర్డినేటర్ గొల్లపెల్లి రాజేందర్ గౌడ్. శనివారం రోజున హైదరాబాద్ నందు గల గాంధీభవన్ యందు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి అధ్యక్షతన రైతుల గురించి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ములుగు నియోజకవర్గ కో – ఆర్డినేటర్ గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ విచ్చేసి రాష్ట్రంలో రైతుల కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అన్ని సౌకర్యాలను అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు అనుగుణంగా ఉండేదని, ముఖ్యంగా రైతులకు వ్యవసాయానికి అనుగుణంగా ఉండే వ్యవసాయ పరికరాలను ఇచ్చేవాళ్ళం అని, ఎరువులకు సబ్సిడీ, విత్తనాలకు సబ్సిడీ అందించే వాళ్ళం అని, ఇందిరా జల ప్రభ ద్వారా బోర్లు వేసి పంటకు సాగు నీరు అందించే వాళ్ళం అని, అకస్మాత్తుగా వర్షం పడితే ధాన్యం తడవకుండా తార్ఫలిన్ కవర్లు ఇచ్చేవాల్లం అని, పంటకు ఇన్సూరెన్స్ కల్పించి, ప్రకృతి విపత్తు వలన నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించే వాళ్ళం అని, భూమి పరీక్షలు చేసి ఏ పంట పండించాలో రైతులకు తెలిపేవారని, ప్రతి పంట గురించి రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పంట దిగుబడి గురించి సమావేశాలు ఏర్పాటు చేసేవారని, తైవాన్ పంపులు కూడా సబ్సిడీలో పంపిణీ చేసేవారని అన్నారు. బి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకి వచ్చాక వీటన్నిటినీ తొలగించింది అని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ వచ్చినందున గతంలో రైతులకు ఏం చేసిందో మళ్ళీ వాటినే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా నుండి కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనేటి శ్యామ్ తదితర నాయకులు పాల్గొన్నారు.