
సిద్దిపేట జిల్లాలో సమ్మె విజయవంతం.
నాలుగు లేబర్ కోట్లు వెంటనే రద్దు చేయాలి.
29 చట్టాలను తిరిగి తీసుకురావాలి.
కార్మికుల కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి.
స్కీం వర్కర్లందరినీ పర్మినెంట్ చేయాలి.
సిద్దిపేట జిల్లాలో సమ్మె విజయవంతం.
సిద్దిపేట అర్బన్:- కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గ ద్రోహి అని కార్మిక సంఘాల నాయకులు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కృష్ణపురం లక్ష్మణ్, బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి మంచే నరసింహులు, హెచ్ ఎం ఎస్ రాష్ట్ర కార్యదర్శి సుదర్శన్ రావు,అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగో లేబర్ కోడు లను వెంటనే రద్దు చేయాలని, 29 రకాల చట్టాలను వెంటనే తీసుకురావాలని స్కీం వర్కర్లందర్నీ పర్మినెంట్ చేయాలని కనీస వేతనం ప్రతి కార్మికుడికి 26 వేల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈరోజు సార్వత్రిక సమ్మె కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో చర్చి గ్రౌండ్ నుండి విక్టరీ టాకీస్ మీదుగా పాత బస్టాండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం 2021లో కరోనాకాలంలో ప్రజలు ఒకవైపు తమ ప్రాణాలనుకాపాడుకోవడానికి ఇంట్ల నుండి బయటకు పోలేని సమయంలో బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపక్షాలు వ్యతిరేకించినా 29 చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను ఆమోదించుకొన్నది. ఇప్పటికే బిజెపి పాలిత రాష్ట్రాలలో చట్టాలను రద్దు చేసి వాటి అమలు కోసం ప్రయత్నించింది 1886లో పోరాడి సాధించుకుని రక్తపుటేరుల ద్వారా సిద్ధించిన ఎనిమిది గంటల పని మేడే స్ఫూర్తితో ఆవిర్భవిస్తే దాన్ని నిరంకుశ ప్రభుత్వం రద్దు చేసే పది గంటలకు చట్టం చేసింది. దీని ఫలితంగా కార్మికులను కట్టు బానిసలుగా మార్చే పద్ధతి తీసుకోవచ్చి కార్మికుల శ్రమను దోపిడీ చేసి పెట్టుబడిదారులకు లాభాలు ఆర్జించే విధంగా ఈ కోడ్లు ఉపయోగపడుతుంది. అలాగే కనీస వేతనం చట్టాన్ని రద్దుచేసి రోజుకు 176 నెలకు 4725 రూపాయలు వేతనం వచ్చే విధంగా చట్టంలో మార్పు చేసిందని వీటి ఫలితంగా కార్మికులు బ్రతికి బట్ట కట్టే పరిస్థితి లేదని నేడు పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో కార్మికుడు పేదరికంలోకి నెట్టబడుతాడని తినడానికి తిండి గింజలు దొరకకుండా యజమాన్యం ప్రభుత్వం ఇచ్చే బిక్షం మీద ఆధారపడి బతకడానికి కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రలు ఇకనైనా మానుకోండి కార్మికులకు హాని చేసేటువంటి లేబర్ కోడ్ లను రద్దుచేసి తిరిగి 29 చట్టాలను అమలు చేసి స్కీం వర్కర్లుగా కొనసాగుతున్న అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం, మున్సిపల్, గ్రామపంచాయతీ,మెప్మా తదితర వర్కర్లందరినీ పర్మినెంట్ చేసి కనీస వేతనం 26000 ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేని పక్షంలో పెట్టుబడుదారులకే ఉడిగం చేస్తాం లేబర్ కోడ్ లను తప్పనిసరిగా అమలు చేస్తాం పట్టుబట్టి కూర్చుంటే బిజెపి ప్రభుత్వాన్ని కార్మిక వర్గ ఐక్యతతో విశాల ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో కూల్చి వేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మె కార్యక్రమంలో వామపక్ష పార్టీలు సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి,తెలంగాణ ప్రజా ప్రాంట్ నాయకులు సత్తయ్య సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు ఈ ప్రదర్శనలో కార్మిక నాయకులు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్,తునికి మహేష్,మామిడాల కనకయ్య,చింతల వెంకటయ్య,ఎఐటియుసి జిల్లా సహాయకార్యదర్శి బెక్కంటిసంపత్,కర్నాల చెంద్రం, బిఆర్టియు జిల్లా అధ్యక్షులు పిండి అరవింద్,ప్రధాన కార్యదర్శి బండారు నర్సింలు,బాయికాడి శ్రీనినాస్,హెచ్ ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు ఇదారి మల్లేశం ,కౌసళ్య, లలిత,రమెష్, భూలక్ష్మి, నీరజ,అరుణ,శ్రీలత,మేఘమాల,కళావతి,గుఱ్ఱం నర్సింలు,డబ్బేట రాజయ్య,వినోద,కృష్ణవేణి,మమత, తదితరులు పాల్గొన్నారు