కేరళ మోడల్ దేశానికే ఆదర్శం
కేరళ వామపక్ష ప్రభుత్వం విద్య వైద్య సంస్థలను ప్రభుత్వరంగంలోనే నిర్వహిస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉంచుతుందని కేరళ వామపక్ష ప్రభుత్వ ప్రత్యమ్నాయ విధానాలు దేశానికే ఆదర్శమని కేరళ పార్లమెంట్ సభ్యులు శివదాసన్ అన్నారు .
ఆదివారం ఉదయం బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ వాకర్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ఆధ్వర్యంలో వాకర్స్ తో ఇంట్రాక్టివ్ సమావేశం జరిగింది. వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ పివి నిరంజన్ రెడ్డి అధ్యక్షత వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేరళ పార్లమెంటు సభ్యులు ఎంపీ శివదాసన్, శాసనసభ్యులు శాంతా కుమారి, డీకే మురళి రాజగోపాల్ వాకర్స్ తో వాకింగ్ చేసిన అనంతరం జరిగిన మీటింగ్ లో వారు మాట్లాడారు.
ఎంపీ శివదాసన్ మాట్లాడుతూ తాను ప్రాథమిక విద్య నుండి పీ హెచ్ డి వరకు నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని, ప్రస్తుతం తన పిల్లలు సైతం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారని ఇది కేరళ వామపక్ష ప్రభుత్వం యొక్క ప్రత్యామ్నాయ విధానానికి నిదర్శనం అన్నారు .అక్షరాస్యతలో 100% ప్రగతి సాధించిన కేరళ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు కేరళ రాష్ట్రంలో ప్రతి గ్రామములో ప్రభుత్వ పాఠశాల ,దవాఖాన,లైబ్రరీ ,పార్క్ జిమ్ నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రభుత్వ వైద్యం ఆయుర్వేద వైద్యం ప్రతి పౌరుడికి ఉచితంగా అందుతుందన్నారు తెలంగాణలో పేదల ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తే ,కేరళ ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇస్తుందన్నారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటంలో కేరళ పౌర సమాజం వామపక్ష ప్రభుత్వానికి అండగా నిలిచిందన్నారు శాస్త్రీయ దృక్పథం తో కరోన ను ఎదుర్కొందని చెప్పారు వరదలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల కష్టాలలో తమ. ప్రభుత్వం ప్రజల తలలో నాలుకలాగా నిలిచిందన్నారు. కేరళ రాష్ట్రంలో మతకలహాలకు చోటు లేదన్నారు సంపూర్ణ మతసామరస్యతను అమలు చేస్తూ దేశ సమైక్యతకు బాసటగా నిలుస్తుందని చెప్పారు వాకర్స్ సంఖ్యను మరింత పెంచుతూ ప్రజల ఆరోగ్యాలకు వైద్యంతో పాటు వ్యాయామం కూడా అవసరమని చెప్పారు. అనంతరం కేరళ ఎంపీ ఎమ్మెల్యే లను వాకర్స్ క్లబ్ సభ్యులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ లింగా ప్రకాష్, మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వి నాగభూషణం పార్క్ వాకర్స్ క్లబ్ సెక్రటరీ మనోహర్ రెడ్డి, కోశాధికారి ఎం దశరథ్ మాజీ ఏరియావైస్ ప్రెసిడెంట్ సంపత్ రెడ్డి, ఏరియా వైస్ ప్రెసిడెంట్ సంకా మురళి కృష్ణ మాజీ ప్రెసిడెంట్లు సలిపేల రమేష్ రెడ్డి, కందూరి కృష్ణ, శైలజ మోహన్, వర్కర్స్ క్లబ్ సభ్యులు టీ స్కైలాబ్ బాబు, నిమ్మల రాజశేఖర్, ఆర్ వెంకట్రాములు, కోట రమేష్ కల్లూరి రమేష్ డా.సునీల్, రత్నాకర్ రెడ్డి కె వీరయ్య, రాజేశ్వర్,జి కృష్ణ తదితరులు పాల్గొన్నారు