కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు:ఏసిపి
కల్లూరు సబ్ డివిజన్ ప్రజలకు తెలియజేయునది ఏమనగా రాబోవు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కువ రోజులు సెలవులు ఉన్నందున, ప్రజలు తమ తమ గ్రామాలకు వెళ్లే సమయంలో ఇళ్లకు తాళాలు వేసి, ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ విషయాన్ని పోలీసు వారికి తెలియజేయాలి.
కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు…
కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు జరగకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా.. గతంలో కోడి పందాలు, పేకాట శిబిరాలు నిర్వహించిన వారిని బైండోవర్ చేయాలని, అదేవిధంగా వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించడం జరిగింది.
చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా చర్యలు…
పక్షులతో పాటు ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాను ఎవరైనా విక్రయించినా లేదా వినియోగించినా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.
సంక్రాంతి పండుగ వేళ యువత వినియోగించే చైనా మాంజా (సింథటిక్ దారం, గాజు పొడి) చాలా ప్రమాదకరం. ఈ దారం ఉపయోగించడం వల్ల పక్షులకు మరియు ప్రజలకు గాయాలయ్యే అవకాశం ఉంది.
ఎవరైనా చైనా మాంజా విక్రయించినా లేదా వినియోగించినా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చట్టవిరుద్ధమైన చైనా మాంజా నియంత్రణకై ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోంది. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి అని తెలిపారు.