
ఈ69న్యూస్ హనుమకొండ: జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల విజయవంతం కోసం క్రీడా శాఖ విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. మే 1 నుండి 31 వరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 23 క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 4వ తరగతి నుండి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. కోచ్లు వివిధ పాఠశాలలు, కళాశాలలను సందర్శించి కరపత్రాలు, రిజిస్ట్రేషన్ ఫారాలు పంపిణీ చేశారు. శిబిరాలపై విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించినట్లు జిల్లా క్రీడాధికారి గుగులోతు అశోక్ కుమార్ తెలిపారు.